జేఎన్టీయూలో విద్యార్థి ఆత్మహత్య
- తల్లి గర్భంలోనే శిశువుకు శస్త్రచికిత్స.. - November 16, 2026
- చిన్న, మధ్యతరహా పత్రికల సమస్యలపై మేధోమథనం - November 16, 2026
- సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం! - November 16, 2026

హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్బీ పరిధిలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)లో విషాద ఘటన చోటుచేసుకుంది. వర్సిటీ హాస్టల్ భవనం పైనుంచి దూకి 19 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో యూనివర్సిటీ ప్రాంగణంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని తదుపరి ప్రక్రియల నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
