ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి – ఏఐటీయూసీ డిమాండ్

  • మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆశా వర్కర్లకు రూ.18 వేల వేతనం, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏఐటీయూసీ నాయకులు డీఆర్ఓ మాలతికి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కౌన్సిల్ సభ్యుడు డీజీ నరేందర్ ప్రసాద్ మాట్లాడుతూ ఏడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

You may also like...