రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) షాపూర్‌నగర్‌లోని హెచ్ఎంటీ కాలనీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని హరిహర కళాభవన్‌లో కుత్బుల్లాపూర్ శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనని, ప్రేమాభిమానాలు, సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
