కుత్బుల్లాపూర్: ఉమాదేవి నగర్ కాలనీ అభివృద్ధిలో భాగంగా ఎనిమిది గల్లీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.60 లక్షలు, ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.2.60 లక్షల నిధులు మంజూరయ్యాయి. జోనల్ కమిషనర్, ఐఏఎస్ అధికారి పింకేష్తో చర్చించి నిధుల మంజూరుకు ప్రత్యేక చొరవ తీసుకున్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి, 277వ మహాదేవపురం డివిజన్ అధ్యక్షుడు సిద్ధనోళ్ల సంజీవరెడ్డికి కాలనీ కమిటీ సభ్యులు షెర్విరాల కృష్ణమూర్తి గుప్త, మహేష్ గౌడ్, కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.