కర్జపల్లిలో 280 మంది ఓటర్లకు SIR నోటీసులు
- కర్జపల్లిలో 280 మంది ఓటర్లకు SIR నోటీసులు - September 15, 2026
- యువత క్రీడల వైపు అడుగులు వేయాలి - September 15, 2026
- ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో గణనాథునికి ప్రత్యేక పూజలు - September 15, 2026
సిర్పూర్(టి): మండలంలోని కర్జపల్లి గ్రామంలో ప్రత్యేక ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా 280 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి వారి వివరాలకు సంబంధించిన ధ్రువపత్రాలను సేకరిస్తున్నారు. అర్హత, ఓటరు జాబితాలోని వివరాల పరిశీలన కోసం అవసరమైన పత్రాలను అందజేయాలని బీఎల్ఏ చంద్రకళ సూచించారు. నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ నిర్ణీత సమయంలో సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి SIR ప్రక్రియకు సహకరించాలని కోరారు.
