ఆటపాటలతో దద్దరిల్లిన ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం

బెజ్జూరు: మండలంలోని ఎల్కపల్లి గ్రామంలోని అంబేద్కర్‌ భవన్‌లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రాష్ట్ర చైర్మన్‌ నరాల సత్యనారాయణ, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లహన్‌ రాజ్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. రాష్ట్ర నాయకులతో పాటు మంచిర్యాల TUV నాయకులు, బెజ్జూరు మండల నాయకులు పాల్గొన్నారు. కళాజాత నాట్య బృందం ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలతో కార్యక్రమం సందడిగా సాగింది. ఉద్యమకారులు ఉత్సాహంగా పాల్గొని ఉద్యమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నాయకులు ఉద్యమకారుల సమస్యలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు.

You may also like...