తొంకిని రహదారి అధ్వానం.. బురదలోనే రాకపోకలు
- ఆటపాటలతో దద్దరిల్లిన ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం - September 17, 2026
- వర్షాకాలంలో మరింత అవస్థలు.. వాహనాలు, ఎడ్లబండ్లకు దారేది - September 17, 2026
- కర్జపల్లిలో 280 మంది ఓటర్లకు SIR నోటీసులు - September 15, 2026
సిర్పూర్(టి): మండలం తొంకిని గ్రామ సమీపంలోని ప్రాణహిత నదికి వెళ్లే మార్గం అధ్వానంగా మారింది. వర్షాలతో రహదారి మొత్తం బురదమయంగా మారడంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గం గుండా రైతులు తమ చేనులకు వెళ్తుండగా, నదికి స్నానానికి వచ్చే భక్తులు కూడా అవస్థలు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీరు సైతం రోడ్డుపై నిల్వ ఉండటంతో సమస్య మరింత తీవ్రమైంది. రోడ్డు మంజూరు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు, భక్తులు ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.
