ప్రజా భద్రతకు సీసీ కెమెరాలే నేటి నిఘా కవచం యువత సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి – ఎస్సై వెంకటరావు
నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 10: ప్రజా భద్రత, నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని నస్రుల్లాబాద్ మండల ఎస్సై వెంకటరావు అన్నారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్సెటి) కామారెడ్డిలో సీసీటీవీ కెమెరా ట్రైనింగ్ రెండో బ్యాచ్ శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సై వెంకటరావు దీపప్రజ్వలన చేసి శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భద్రత, ప్రజల రక్షణలో…
