Category: కామారెడ్డి

గడ్డం హేమ చంద్రిక ను హాస్పిటల్ లో చూసి ధ్యైరం చెప్పిన పలువురు…

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో హాస్టల్లో గడ్డం హేమచంద్రిక పడిపోవడం పడిపోవడం వల్ల నెత్తికి బలమైన దెబ్బ తగిలి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. నిజామాబాద్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న చంద్రికను పలువురు కాలోజివాడి సర్పంచ్ చంద్ర రెడ్డి, ఉప సర్పంచ్ సాయి కుమార్ ఓంగార్డ్ గంగారెడ్డి కారోబార్ ప్రసాద్ ఓదార్చి ధైర్యం చెప్పారు.

ఆర్ టి ఐ జిల్లా స్థాయి సమన్వయ కమిటీకి కోనాపూర్ వడ్ల శివరాం శ్రీను ఎంపిక

బాన్సువాడ: సమాచార హక్కు చట్టం-2005 అమలు కోసం కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసినా జిల్లా స్థాయి సమన్వయ కమిటీకి బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన ఆర్టీఐ కార్యకర్త పడ్ల శివరాం శ్రీను పేరును బాన్సువాడ ఆర్డీవో సిఫార్సు చేశారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో రవీందర్ రెడ్డి లేఖ నం. F/2093/2026 ద్వారా కలెక్టర్ కు ప్రతిపాదన పంపారు. 4 ఏళ్లుగా ఆర్టీఐ రంగంలో అనుభవం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం బాన్సువాడ…

బీబీపేట మండల కేంద్రంలో దడిగే నర్సింలు గారు అకాల మరణం…

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో శ్రీ దడిగే నరసింహులు గారు తేదీ 23/09/2026 రోజున అకాల మరణం చెందినారు అని తెలుసుకున్న తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి గారు మరియు వారి మిత్రబృందం కామారెడ్డి నియోజకవర్గం గార్లు ఈరోజు అంతిమ యాత్రలో పాల్గొని వారి కుటుంబీకులను పరమర్శించడం జరిగింది.

మాదాపూర్ సంగమేశ్వర్ రోడ్డులో గుంత…

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మాదాపూర్ గ్రామంలో మాదాపూర్ నుంచి సంగమేశ్వర్ వెళ్లే దారిలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి రోడ్డు కృంగిపోయినది అయితే రోడ్డును పూడ్చడానికి గ్రామ సర్పంచ్ మరియు సిబ్బంది ట్రాక్టర్లు మట్టి తీసుకుపోయి గుంతను పూడ్చారు.

శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠకు స్థల పరిశీలన

బీర్కూర్: గ్రామపంచాయతీ పరిధిలోని కమాన్ వద్ద శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మాదాపూర్ బీసీ కాలనీలో రోడ్డుపై పడిన చెట్టు…

కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం మాందాపూర్ గ్రామంలో బీసీ కాలనీ లో వీచిన గాలులకు చెట్టు రోడ్డుపై పడింది అయితే ఇట్టి విషయంపై స్పందించిన సర్పంచ్ హరీష్ యాదవ్ వార్డ్ నెంబర్ పందిరి శ్రీకాంత్ రెడ్డి రాజేష్ పాల్గొని అడ్డంగా ఉన్న చెట్టు పక్కకు జరిపారు.

సెలైన్ చేతికే… సేవ మాత్రం ఆగలేదు!

బాన్సువాడ :తాను పేషెంట్‌గా మారినా.. రోగుల సేవలోనే డాక్టర్ శ్రీను నాయక్వృత్తి ధర్మానికి అంకితభావం.. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం,వైద్యుడిని దైవంతో సమానంగా ఎందుకు చూస్తారో నిరూపించే మానవీయ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ తన విధులకు సెలవు పెట్టకుండా, ఒక చేతికి సెలైన్ ఎక్కించుకుంటూనే మరోవైపు రోగులకు వైద్య సేవలు అందించిన డాక్టర్ శ్రీను నాయక్ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి ప్రతిరోజూ చుట్టుపక్కల గ్రామాల నుంచి…

ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు, 24,25 తేదీల్లో అవకాశం

బాన్సువాడ :బాన్సువాడలోని ఎస్సార్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం డిగ్రీ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందూరి గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఇప్పటివరకు డిగ్రీలో ప్రవేశం పొందని విద్యార్థులకు ఈ స్పాట్ అడ్మిషన్లు మంచి అవకాశమని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు నిర్ణీత తేదీల్లో కళాశాలకు హాజరై, అవసరమైన…

అర్ధరాత్రి అరెస్టులతో విద్యార్థి నాయకులపై ఉక్కుపాదం – సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి: బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రవట్టి సాయిబాబా

బాన్సువాడ, సెప్టెంబర్ 11: ఎలాంటి పిలుపు, కార్యక్రమం లేకపోయినా బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులను పోలీసులు అర్ధరాత్రి నుంచి అరెస్టులు చేయడం దారుణమని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రబట్టి సాయిబాబా ఆరోపించారు. విద్యార్థి నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం ప్రభుత్వ అసహనానికి నిదర్శనమని విమర్శించారు.పోలీసులు అర్ధరాత్రి నుంచి విద్యార్థి నాయకుల ఇళ్లకు వెళ్లి అరెస్టులు చేయడం వెనుక ప్రభుత్వ భయాందోళన స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎలాంటి ఆందోళనకు పిలుపు ఇవ్వకపోయినా అరెస్టులు చేయడం పోలీసుల ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని చాటుతోందని అన్నారు.విద్యార్థుల…

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి తెలంగాణ చరిత్ర పరిరక్షణకు ‘సప్త సంకల్పాలు’ అమలు చేయాలి: బీజేపీ

బాన్సువాడ, సెప్టెంబర్ 10: సెప్టెంబర్ 17ను “తెలంగాణ విమోచన దినోత్సవం”గా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, తెలంగాణ విమోచన చరిత్రను శాశ్వతంగా పరిరక్షించేందుకు “తెలంగాణ సప్త సంకల్పాలు” అమలు చేయాలని కోరుతూ బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డికి బీజేపీ నాయకులు గురువారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో మరువలేని మహోన్నతమైన రోజని అన్నారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాలు, జమీందారీ–జాగీర్దారీ దోపిడీ…