మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు భేటీ


జుక్కల్ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చర్యలు చేపట్టారు.ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే.. నియోజకవర్గంలోని పలు రహదారి అభివృద్ధి పనులపై చర్చించారు.ప్రధానంగా రూ.63.41 కోట్ల అంచనా వ్యయంతో HAM ఫేజ్-1 కింద చేపట్టనున్న 54.31 కిలోమీటర్ల రహదారుల పటిష్టత పనులకు త్వరలో శంకుస్థాపన చేసేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రిని కోరారు. ఇందులో అన్నసాగర్–పిట్లం రహదారి 10.50 కి.మీ.కు రూ.12.16 కోట్లు,మద్దెలచెరువు–మెదక్ జిల్లా సరిహద్దు (పిట్లం మీదుగా) 19.40 కి.మీ.కు రూ.21.49 కోట్లు, బాన్సువాడ–బిచ్కుంద రహదారి 24.41 కి.మీ.కు రూ.29.76 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
అలాగే NH-161 నుంచి ఏక్లార, జి.మద్నూర్ మీదుగా చెందేగాం వరకు ఉన్న రహదారిని పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆర్‌అండ్‌బీ శాఖకు బదిలీ చేయాలని ఎమ్మెల్యే కోరారు. దీనిపై స్పందించిన మంత్రి త్వరలోనే బదిలీ ప్రక్రియ పూర్తి చేసి, నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి అవసరమైన అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సమీక్షలో ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.నియోజకవర్గంలోని స్థానిక రాజకీయ అంశాలపై కూడా మంత్రి, ఎమ్మెల్యేలు సుదీర్ఘంగా చర్చించి పలు సూచనలు, సలహాలు చేసుకున్నారు

You may also like...