విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి తెలంగాణ చరిత్ర పరిరక్షణకు ‘సప్త సంకల్పాలు’ అమలు చేయాలి: బీజేపీ
- విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి తెలంగాణ చరిత్ర పరిరక్షణకు ‘సప్త సంకల్పాలు’ అమలు చేయాలి: బీజేపీ - September 10, 2026
- ప్రజా భద్రతకు సీసీ కెమెరాలే నేటి నిఘా కవచం యువత సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి – ఎస్సై వెంకటరావు - September 10, 2026
- మా కష్టార్జిత బకాయిలు చెల్లించే వరకు పోరాటం ఆగదు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు - September 8, 2026
బాన్సువాడ, సెప్టెంబర్ 10: సెప్టెంబర్ 17ను “తెలంగాణ విమోచన దినోత్సవం”గా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, తెలంగాణ విమోచన చరిత్రను శాశ్వతంగా పరిరక్షించేందుకు “తెలంగాణ సప్త సంకల్పాలు” అమలు చేయాలని కోరుతూ బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డికి బీజేపీ నాయకులు గురువారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో మరువలేని మహోన్నతమైన రోజని అన్నారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాలు, జమీందారీ–జాగీర్దారీ దోపిడీ నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన చారిత్రక ఘట్టానికి సెప్టెంబర్ 17 ప్రతీకగా నిలుస్తుందన్నారు.
విమోచన కోసం రైతులు, మహిళలు, యువకులు, సామాన్య ప్రజలు చేసిన పోరాటాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. హైదరాబాద్‌లో సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు “స్టాట్యూ ఆఫ్ లిబరేషన్–తెలంగాణ” నిర్మించాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో “హైదరాబాద్–తెలంగాణ విమోచన మ్యూజియం” ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తృప్తి శివప్రసాద్, ఉమేష్, శ్రీనివాస్, సిద్ధి బాలరాజ్, పాశం భాస్కర్ రెడ్డి, చీకట్ల రాజు, కొండని గంగారం, పద్మ నరేష్, మహేందర్, సాయి రెడ్డి, గోస్కె పురుషోత్తం, మాగి నాగరాజ్, భూమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
