ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు, 24,25 తేదీల్లో అవకాశం

బాన్సువాడ :బాన్సువాడలోని ఎస్సార్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం డిగ్రీ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందూరి గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఇప్పటివరకు డిగ్రీలో ప్రవేశం పొందని విద్యార్థులకు ఈ స్పాట్ అడ్మిషన్లు మంచి అవకాశమని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు నిర్ణీత తేదీల్లో కళాశాలకు హాజరై, అవసరమైన అన్ని విద్యార్హత, ఇతర సంబంధిత ధ్రువపత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు.కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ లైఫ్ సైన్సెస్, బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను కొనసాగించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందూరి గంగాధర్ కోరారు.డిగ్రీలో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు సెప్టెంబర్ 24, 25 తేదీల్లో ఆలస్యం చేయకుండా కళాశాలను సంప్రదించి స్పాట్ అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

You may also like...