Category: జిల్లా వార్తలు

ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ.. బాలరాజ్ గౌడ్‌పై రౌడీషీట్!

ఘట్కేసర్, బ్యూరో: భూ వివాదాలు, నకిలీ పత్రాల వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలగోని బాలరాజ్ గౌడ్‌పై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. ఘట్కేసర్ ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయనపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు రౌడీషీట్ తెరిచినట్లు తెలుస్తోంది. భూ...

ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి!

జనగామ బ్యూరో: వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న రైతును ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం విశ్వనాథపూర్ గ్రామంలో ట్రాక్టర్ బోల్తాపడిన ప్రమాదంలో ఓ రైతు దుర్మరణం చెందాడు. రోజంతా పొలంలో వ్యవసాయ పనులు ముగించుకున్న రైతు ట్రాక్టర్‌పై...

క్వారీలకు అండగా.. రూ.2 లక్షలతో అడ్డంగా బుక్కైన సర్పంచ్!

మహబూబాబాద్ : వినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు మరో ప్రజాప్రతినిధి చిక్కాడు. గ్రానైట్ క్వారీల కార్యకలాపాలకు సహకరించేందుకు భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసిన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం మోదుగడ్డ తండా సర్పంచ్ ధరావత్ వీరును వరంగల్ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఖమ్మంలోని...

చలో సిద్దిపేట పోస్టర్ విడుదల

చలో సిద్దిపేట సభను విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశం.దేశంలోనే తొలిసారిగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభంఈ నెల 19వ తేదీన సిద్దిపేటలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి కామారెడ్డి నియోజకవర్గ ముఖ్య నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు, దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ మధుసూదన్ గారు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా సభకు కామారెడ్డి నియోజకవర్గం…

బీబీపేట్ SR గార్డెన్స్ లో 206 మందికి పింఛన్ల పంపిణీ

కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట్ SR గార్డెన్స్ లో బుధవారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మొత్తం 206 మంది లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీబీపేట్ సర్పంచ్ సాత్విక సాయినాథ్, PACS చైర్మన్ సుతారి రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్…

గత పాలకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు

మకాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తోంది!కామారెడ్డి జిల్లా జుక్కల్, బిచ్కుంద మండల కేంద్రాల్లో లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలతో పాటు, కల్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల చెక్కులను అందజేశాను.గత పాలకులు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో ఆశలు కల్పించి పేదలను నిరాశపరిచారు. కానీ నేడు మన ప్రజా ప్రభుత్వం ప్రజల కష్టాలను అర్థం చేసుకుని, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అర్హులైన…

ఎల్లారెడ్డి అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు కోరకు స్థల పరిశీలన…

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోరకు అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కమిటీ, డివిజన్ మండల నాయకుల  ఆధ్వర్యంలో పరిశీలన చేశారు ఈ సందర్భంగా చౌరస్తాలో విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కమిటీ సభ్యులు పరిశీలించారు. విగ్రహ ఏర్పాటుకు సంబంధించి స్థల పరిశీలన, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించారు.అంబేద్కర్  ఆశయాలను భావితరాలకు తెలియజేసే విధంగా ఎల్లారెడ్డిలో ప్రతిష్టాత్మకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని యువజన సంఘం…

విద్యార్థులను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

పరిగి మండలం ఇబ్రహీంపూర్ గ్రామ పరిధిలోని రూప్ సింగ్ నాయక్ తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న అడవి ఆముద కాయలు తిని అస్వస్థతకు గురై పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 9 మంది విద్యార్థులను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్యులను కలిసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ,వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.విద్యార్థులు పూర్తిస్థాయిలో కోలుకునే వరకు బాధిత విద్యార్థులకు,వారి కుటుంబాలకు…