Category: జిల్లా వార్తలు

TSUTF- MJP Wing రాష్ట్ర అధ్యక్షులు లివింగ్స్టన్

బి.సి. గురుకుల ఉద్యోగుల పెండింగ్ డీఏ బకాయిలు విడుదల చేయాలి – పీఆర్సీ వెంటనే ప్రకటించాలి…గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా TSUTF నిరంతరం కృషి చేస్తుందని TSUTF–MJP WING రాష్ట్ర అధ్యక్షుడు జి. లివింగ్స్టన్ పేర్కొన్నారు. TSUTF–MJP WING రాష్ట్రస్థాయి మెంబర్షిప్ నమోదు కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి బాలికల MJP గురుకుల పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయ బృందం నాయకులకు సాదర స్వాగతం…

సంక్షేమ పథకాల పంపిణీలో రాజకీయం చేయడం తగదు : కట్టంగూర్ ఉప సర్పంచ్ గుండు రాంబాబు

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 18 : ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల పంపిణీలో కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల రాజకీయాలు చేయడం సరికాదని కట్టంగూర్ ఉప సర్పంచ్ గుండు రాంబాబు ఆరోపించారు. కట్టంగూర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులతో కలిసి బుధవారం విలేకర్లతో మాట్లాడారు. కట్టంగూర్ ఎంపిడీఓ కార్యాలయంలో మంగళవారం పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ సందర్భంగా సర్పంచ్ వ్యవహరించిన తీరు సబబుగా లేదన్నారు. పింఛన్ల పంపిణీ సమయంలో సర్పంచ్…

పాల్వంచ రైతు వేదికలో 233 మందికి పింఛన్ల పంపిణీ

కామారెడ్డి నియోజకవర్గంలోని పాల్వంచ వద్ద గల రైతు వేదికలో బుధవారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మొత్తం 233 మంది లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్వంచ సర్పంచ్ శేఖర్ మండల అధ్యక్షులు రమేష్ గౌడ్, సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు,…

మాచారెడ్డి రైతు వేదికలో 207 మందికి పింఛన్ల పంపిణీ

కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి చౌరస్తా వద్ద గల రైతు వేదికలో బుధవారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మొత్తం 207 మంది లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నర్సింగ్ రావు, గ్రామ సర్పంచ్ రావుల ప్రభాకర్ వినోద,…

పార్టీ కోసం శ్రమించిన పర్వత్ రెడ్డికే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలి.!

వెల్దండ,నవంబర్ 18: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో ఏళ్లుగా నిరంతరం శ్రమిస్తున్న సీనియర్ నాయకులు మల్లేపల్లి పర్వత్ రెడ్డికి కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున కోరుతున్నారు.పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేయడంతో పాటు కార్యకర్తలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న పర్వత్ రెడ్డికి రైతుల సమస్యలపై కూడా పూర్తి అవగాహన ఉందని వారు పేర్కొంటున్నారు.స్వయంగా రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిగా రైతుల కష్టాలు, వ్యవసాయ రంగ…

వెల్దండ బీజేవైఎం నూతన కమిటీ నియామకం

జ్ఞాన తెలంగాణ,వెల్దండ: కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండల కేంద్రంలో బీజేవైఎం నూతన మండల కమిటీ నియామక కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు బాణావత్ అరుణ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు ధన్నోజు నరేష్ చారి ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.నూతన కమిటీ మండల ఉపాధ్యక్షులుగా ఏ. జగన్, కే. శరత్, ఎన్. గణేష్, ఎం. సైదులు, ప్రధాన కార్యదర్శులుగా టీ. వంశీ, కే. అంజనేయులు, కార్యదర్శులుగా ఎం. విష్ణు,…

బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ఈ రోజు మోమిన్ పేట్  మండల  పరిధిలోని ఎనకతల గ్రామంలో  యూనియన్ బ్యాంక్ ఇండియ ఆధ్వర్యంలో  ఫైనాన్షియల్ ఇన్క్లూజివ్  అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ బ్యాంక్ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన  కలిగి ఉండాలని   సూచించారు, నేటి ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరూ బీమా పాలసీ లు చేయించుకోవడం తప్పనిసరి. జీవితం ఎప్పుడూ ఏమి జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏదైనా సమస్య వచ్చినపుడు, ప్రమాదాలు ఎదురైనపుడు మన కుటుంబాన్ని బీమా పథకం కాపుడుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్, బీమా పథకాలు…

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం.!

వెల్దండ నవంబర్ 18 : వెల్దండ మండల పరిధిలోని గుండాల గ్రామానికి చెందిన పేరుమల్ల శ్రీశైలం మృతి చెందడంతో గ్రామ సర్పంచ్ జక్కుల శిరీష వెంకటయ్య యాదవ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు. ఉప సర్పంచ్ పేరుమల్ల మనీషా సైదులు రూ.2,500 అందించగా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎనుముల గోపాల్ యాదవ్ సైతం తనవంతు ఆర్థిక సహాయం చేశారు.అలాగే బాధిత కుటుంబానికి వావిళ్ల తిరుపతయ్య, కొమ్ము లింగం, పేరుమల్ల కృష్ణ, పేరుమల్ల శ్రీను,…

పార్టీ కోసం శ్రమించిన భాస్కర్ రెడ్డికి మార్కెట్ చైర్మెన్ – ఇమ్రాన్ బాబా

ఆమనగల్ నవంబర్ 18 : ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడూరు భాస్కర్ రెడ్డికి కేటాయించాలని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇమ్రాన్ బాబా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గూడూరు భాస్కర్ రెడ్డి ఎంతో శ్రమించారని, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారని…

అయ్యప్ప శరణుఘోషతో మార్మోగిన వెల్దండ.. 41 రోజుల మండల దీక్షకు శ్రీకారం!

వెల్దండ: మండల కేంద్రంలో అయ్యప్ప స్వాముల మాలధారణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అయ్యప్ప ఆలయ ఆవరణలో పెద్దలు, యువకులు, చిన్నారులు సంప్రదాయబద్ధంగా అయ్యప్ప మాలలు ధరించి 41 రోజుల దీక్షను ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని భక్తిమయంగా మార్చారు. మండల దీక్షలో భాగంగా నియమనిష్ఠలతో సాత్విక జీవనం గడుపుతూ, నిత్యం పూజలు, భజనలు నిర్వహిస్తామని స్వాములు తెలిపారు. కార్తీక మాసంలో శబరిమల యాత్రకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.మాలధారణ కార్యక్రమంలో భక్తులు…