59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

WhatsApp Image 2026-11-18 at 20.26.51.jpeg

59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా 5వ రోజున నేడు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో

'వర్షపు నీటి సంరక్షణ 'అనే అంశంపై పాఠశాలల విద్యార్థులకు చిత్రలేఖనం పోటీ నిర్వహించారు.జిల్లా కేంద్ర గ్రంథాలయ అధికారి టి. మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం చేపట్టారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణి* హాజరై, ముందుగా సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలంకరణ, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సమావేశంలో స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ నీటిని ఏ విధంగా పొదుపు చేయాలో పలు సూచనలు చేశారు. అదే విధంగా గ్రంథాలయం ప్రాముఖ్యతను గురించి వివరించారు. అనంతరం పోటీలను ప్రారంభించారు.ఈ పోటీలో పట్టణంలోని వివిధ పాఠశాలల నుంచి 55 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రంథపాలకులు సిహెచ్. రవి, బి. పద్మారావు, గ్రంథాలయ సిబ్బంది నరహరి, నిర్మల, మసరం రాజేంద్రప్రసాద్,ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

You may also like...