Category: జిల్లా వార్తలు

ఈసీని తొలగించాలని సిపిఎం, సిపిఐ పార్టీలు ధర్నాకు పిలుపు

నాగర్‌కర్నూల్: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ గుప్తాను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 6న నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎఫ్‌ఎండీ ఫయాజ్, సీపీఎం జిల్లా కార్యదర్శి వి.పర్వతాలు తెలిపారు.సోమవారం సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలనే డిమాండ్‌తో చేపడుతున్న ఆందోళనకు వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

చెరువులు, కుంటలకు హద్దులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి

చెరువులు, కుంటలకు హద్దులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి  జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్‌, అక్టోబర్‌ 5: మండలంలోని మునుకుంట్ల గ్రామంలో పెద్ద చెరువు, కోమటికుంట, దబ్బికుంటలకు హద్దులు ఏర్పాటు చేసి కబ్జాల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ గ్రామ సర్పంచ్‌ గుల్లి నరేష్ సోమవారం నల్లగొండలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. చెరువులు, కుంటల పరిధిలోని భూములను కొందరు రైతులు ఆక్రమించి సాగు చేసుకుంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. నీటి నిల్వ సామర్థ్యం తగ్గి, పారుదల సక్రమంగా…

కొట్ర గ్రామంలో కరెంటు కటకటాలు.. ప్రజావాణిలో సర్పంచ్ ఫిర్యాదు

వెల్దండ అక్టోబర్ 05:వెల్దండ మండల పరిధిలోని కొట్ర గ్రామంలో నెలకొన్న తక్కువ వోల్టేజ్ విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్ శారద చెన్నయ్య ఆధ్వర్యంలో గ్రామస్థులు సోమవారం వెల్దండ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎంపీడీవో సులోచనకు వినతిపత్రం అందజేశారు.గ్రామంలో సుమారు 100 ఇళ్లకు విద్యుత్ సరఫరా సక్రమంగా అందడం లేదని వారు తెలిపారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ఫ్యాన్లు, లైట్లు సరిగా పనిచేయక దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే…

గడ్డం వెంకటస్వామి ఆశయాలకు ఘన నివాళి

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,అక్టోబర్ 5:దివంగత గడ్డం వెంకటస్వామి 97వ జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. పేదలు, కార్మికులు, అణగారిన వర్గాల హక్కుల కోసం గడ్డం వెంకటస్వామి చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రజా సేవలో...

బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

బుద్వేల్ జెడ్.పి.హెచ్.ఎస్ (ZPHS) ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన ‘రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్’ (ఇంకుడు గుంత)ను ఎమ్మెల్యే శ్రీ టి. ప్రకాష్ గౌడ్ లాంఛనంగా ప్రారంభించారు.

గాంధీభవన్‌కు తరలిన జనగామ సేవాదళ్ నాయకులు

ఓటు చోరీ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం (CEC) చైర్మన్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహిస్తున్న సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా జనగామ జిల్లా సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు సోమవారం పెద్ద ఎత్తున తరలివెళ్లారు.TPCC కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేష్ ఆధ్వర్యంలో జిల్లా, డివిజన్, నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామ, వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలు…

గుండెపోటుతో చికిత్స పొందుతున్న కమ్లికి ఫుడ్ కమిషన్ చైర్మన్ పరామర్శ

వెల్డండ:నారాయణపూర్ తండాకు చెందిన బాణావత్ కమ్లి గుండెపోటుతో బాధపడుతూ మన్నెగూడలోని ఓ ప్రవైట్ హిస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి కమ్లిని పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.అనంతరం తక్షణ ఆర్థిక సహాయంగా రూ.5,000/- రూపాయలు భర్త శంకర్ నాయక్ కు అందించడం జరిగింది.ఈ కార్యక్రమం లో నారాయణపూర్ గ్రామ మాజీ సర్పంచ్ అంజి నాయక్,శ్రీను, బర్కం…

పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలి

పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ పత్తి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ భూక్యా చందు నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జనగామ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ శ్రీధర్‌కు అందజేశారు.ఈ సందర్భంగా చందు నాయక్ మాట్లాడుతూ.. పత్తి దిగుబడి తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పత్తి మిల్లుల్లో సీసీఐ కొనుగోలు…

ఎస్‌ఐఆర్‌పై ప్రతిపక్షాల ప్రచారం తప్పుదారి పట్టించేదే: రామచందర్‌రావు

హైదరాబాద్,వెబ్ డెస్క్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు విమర్శించారు. ఎస్‌ఐఆర్‌ అనేది బీజేపీ చేపట్టిన కార్యక్రమం కాదని, భారత ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన అధికారాలతో నిర్వహిస్తున్న ఎన్నికల...