గడ్డం వెంకటస్వామి ఆశయాలకు ఘన నివాళి

  • 97వ జయంతి వేడుకలు రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహణ
  • ప్రభు గైక్వాడ్‌కు విశిష్ట సేవలకు గుర్తింపు
  • వెటర్నరీ ఇన్‌స్పెక్టర్ సేవలను ప్రశంసించిన ప్రభుత్వం

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,అక్టోబర్ 5:దివంగత గడ్డం వెంకటస్వామి 97వ జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. పేదలు, కార్మికులు, అణగారిన వర్గాల హక్కుల కోసం గడ్డం వెంకటస్వామి చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రజా సేవలో ఆయన చూపిన నిబద్ధత, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి నేటి తరానికి ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో సమాజానికి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రభు గైక్వాడ్, వెటర్నరీ ఇన్‌స్పెక్టర్‌ను ప్రత్యేకంగా సత్కరించారు. విధి నిర్వహణలో అంకితభావం, బాధ్యతాయుత సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందించారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ చేతుల మీదుగా ప్రభు గైక్వాడ్‌కు మెమొంటో అందజేసి ఘనంగా సన్మానించారు. ప్రజాసేవలో మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు ఈ గుర్తింపు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

You may also like...