గుడిచెరువు నిమజ్జన స్థలంలో పోలీసుల భద్రతా ఏర్పాట్ల పరిశీలన
- గుడిచెరువు నిమజ్జన స్థలంలో పోలీసుల భద్రతా ఏర్పాట్ల పరిశీలన - September 23, 2026
- బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా - September 23, 2026
- వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి దుర్మార్గం - September 23, 2026
దేవరుప్పుల మండలంలోని గుడిచెరువు నిమజ్జన స్థలాన్ని డీసీపీ (వెస్ట్)తో పాటు వర్ధన్నపేట ఏసీపీ, పాలకుర్తి సీఐ బుధవారం పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నిమజ్జన ప్రదేశంలో బారికేడింగ్, లైటింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.
