Author: Venkateshwarlu Vardhamanu

ప్రజావాణి అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యత

జనగామ జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్‌షాలోంతో కలిసి ప్రజల నుంచి 481 దరఖాస్తులు స్వీకరించారు. ప్రజలు సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజావాణిలో ఇందిరమ్మ ఇళ్లు, రహదారి కబ్జా, భూ పట్టాలు, భూసర్వే, ఇళ్ల మంజూరు తదితర సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో…

సింగరాజుపల్లిలో శ్రీ స్వాతి ఎలక్ట్రికల్ షాపు ప్రారంభం

దేవరుప్పుల: మండలంలోని సింగరాజుపల్లి గ్రామ ప్రధాన రహదారిపై ధరావత్ తండా మాజీ సర్పంచ్ భానోత్ గేమా నాయక్ ఏర్పాటు చేసిన శ్రీ స్వాతి ఎలక్ట్రికల్ హార్డ్వేర్ అండ్ వైన్డింగ్ షాపును ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు అవసరమైన ఎలక్ట్రికల్, హార్డ్వేర్ సామగ్రి అందుబాటులో ఉండేలా షాపు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు….

గణనాథుడి స్వాగతానికి సిద్ధమైన మండపాలు

వినాయక చవితి పండుగను పురస్కరించుకొని దేవరుప్పుల మండలంలోని పలు గ్రామాల్లో వినాయక మండపాల ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. యువత ఆధ్వర్యంలో మండపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ, విద్యుత్‌ దీపాలంకరణలు, అలంకరణ పనులు చేపడుతున్నారు. వినాయక విగ్రహాల ప్రతిష్ఠకు అవసరమైన ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేస్తున్నారు. పండుగను భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా నిర్వహించేందుకు యువత ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.