మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం
- మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం - September 23, 2026
- భక్తులకు అన్నదానం - September 21, 2026
- ప్రజావాణి అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యత - September 21, 2026
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కామారెడ్డి గూడెం పెద్ద వేపచెట్టు వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని రేషన్ డీలర్ దుద్దుల పరుశరాములు–పద్మ దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు యువసేన యూత్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అన్నదానానికి సహకరించిన దుద్దుల పరుశరాములు–పద్మ దంపతులను కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం అందించడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో కార్యక్రమం విజయవంతంగా కొనసాగిందని యువసేన సభ్యులు పేర్కొన్నారు.
