వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి దుర్మార్గం
- వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి దుర్మార్గం - September 23, 2026
- మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం - September 23, 2026
- భక్తులకు అన్నదానం - September 21, 2026
మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి దుర్మార్గమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రోగుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తున్న వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ప్రజా సమస్యలను ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం ప్రభుత్వ విధానంగా మారిందని విమర్శించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని, బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగించాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వినయ్ భాస్కర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
