బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా

బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం పెద్దమడూరు గ్రామంలో ఇటీవల మృతి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గనుపాక శ్రీనివాస్, పానుగంటి సాయిలు, గోడిశాల సుశీల, గనుపాక ఐలమ్మ కుటుంబాలను పరామర్శించి సంతాపం తెలిపారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న శ్యామల సుధాకర్ రెడ్డి, దుబ్బ రాజశేఖర్, రేగుల స్వామిదాస్, రుద్రోజు యాదగిరి, నాగిళ్ల జాశివలను పరామర్శించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో పల్లా సుందర్ రాంరెడ్డి, బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, తీగల దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...