రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) దూలపల్లి పారిశ్రామిక వాడలో ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధి పేరుతో 80 పరిశ్రమలను తొలగించే హైడ్రా చర్యలను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. 25 ఏళ్లుగా ప్రభుత్వ అనుమతులతో కొనసాగుతున్న పరిశ్రమల్లో సుమారు 5 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. హైడ్రా కోర్టు ఆదేశాలు, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలని, ప్రజలపై దౌర్జన్యం చేయడం సరికాదని హితవు పలికారు. బాధిత పారిశ్రామికవేత్తలకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్ రెడ్డి, మల్లారెడ్డి, వడ్డేపల్లి రాజేశ్వరరావు, ఆదిరెడ్డి రాజిరెడ్డి, శేఖర్ యాదవ్, సరిత రావు, శంకర్ నాయక్, శ్రీనివాస్, మధు, మహేందర్, అశ్విన్, నరసింహ, శేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
