రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) కూకట్‌పల్లి నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ శ్రీ గొట్టిముక్కల వెంగళరావు జన్మదినం సందర్భంగా బాలానగర్ డివిజన్ యువ నాయకుడు మహమ్మద్ సమీ ఆధ్వర్యంలో ఆయన మిత్రబృందం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా వెంగళరావును శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో మరింత చురుకుగా పాల్గొంటూ ప్రజల మన్ననలు పొందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ సమీ మిత్రబృందం సభ్యులు పాల్గొని వెంగళరావుకు తమ అభినందనలు తెలియజేశారు.
