14 15 సర్వే నంబర్లలో అక్రమ నిర్మాణాలు
- ఆహార తయారీ విక్రయాలపై కీసర పోలీసుల దాడులు - November 21, 2026
- విద్యార్థుగూడా అభివృద్ధికి 30 కోట్లు - November 21, 2026
- గంజాయి మొక్కల పెంపకం, విక్రయాల గుట్టురట్టు.. బీటెక్ విద్యార్థి అరెస్ట్ - November 21, 2026

ఘట్‌కేసర్ అన్నోజిగూడ పరిధిలోని కేఎల్ మహేంద్రనగర్ వికలాంగుల, సకలాంగుల కాలనీ సమీపంలో సర్వే నంబర్లు 14, 15 మధ్య ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఘట్‌కేసర్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. సర్వే నంబర్ 14లోని 5 ఎకరాల 21 గుంటల భూమిలో సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని, గతంలో న్యాయస్థానం కూడా అది ప్రభుత్వ భూమిగా తీర్పునిచ్చిందని తెలిపారు. గత 20 రోజులుగా ఐదో బ్లాక్ సమీపంలో జరుగుతున్న నిర్మాణాలను అడ్డుకొని, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి హద్దులు నిర్ధారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎన్. రాములు, కార్యదర్శి ఎం. శ్యామ్ కుమార్, కోశాధికారి ఎన్. యాదగిరి, కె. సురేష్, ఎల్లయ్య, టి. శ్రీనివాస్ పాల్గొన్నారు.
