ఇందిరమ్మ జీవిత బీమాతో ప్రతి కుటుంబానికి భరోసా – దేమి కలాన్‌లో బీమా నమోదు కార్యక్రమం

తాడ్వాయి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకంలో భాగంగా తాడ్వాయి మండలం దేమి కలాన్ గ్రామంలో బీమా నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు జీవిత బీమా భద్రత కల్పించి, ఆర్థికంగా అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా బీమా రక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బీమా నమోదు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అఖిల్ రావు, గ్రామ అధ్యక్షులు బాలరాజ్, శ్రీకాంత్, సాయగౌడ్, గ్రామ సర్పంచ్ బైరవి రాజిరెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి మరియు పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...