చినూర్ గ్రామంలో లబ్ధిదారుల సొంతింటి కల సాకారం…

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం చినూర్ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బసడి మంగ, మంగవ్వ–గోపాల్ కుటుంబం నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో యెల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడంలో సహకరించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, పేద కుటుంబాలకు సొంతింటి కలను నిజం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన ఉద్దేశమని, లబ్ధిదారులు తమ సొంతింటిలో గృహప్రవేశం చేసుకోవడం చూస్తుంటే ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని అన్నారు. ప్రతి అర్హులైన పేద కుటుంబానికి సొంత ఇల్లు అందాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

Dubbaka Srinivas

My name is DUBBAKA SRINIVAS, Education:(B.A), GRADUATED, I have multiple skills but I'm interested journalism My was facing the more than problems in society but I stand with GENUINE & TRUE peoples and society I will try to Justies, I will show the truth to society.

You may also like...