ఎల్ఐసిలో 1996 బ్యాచ్ ఓపెన్ మార్కెట్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
- రైతులకు నీరివ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు? - October 15, 2026
- ఎల్ఐసిలో 1996 బ్యాచ్ ఓపెన్ మార్కెట్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలి - October 15, 2026
- బీజేపీ మండల లేబర్ సెల్ కన్వీనర్గా శ్రీధర్ - October 13, 2026
ఎల్ఐసిలో 1996 బ్యాచ్ ఓపెన్ మార్కెట్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్ అక్టోబర్ 14 : ఎల్ఐసిలో 1996 నోటిఫికేషన్ ద్వారా నియామకాలు పొందిన ఓపెన్ మార్కెట్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలనే ప్రధాన డిమాండ్తో ఐసీఈయూ సికింద్రాబాద్ డివిజన్ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం, 14 అక్టోబర్ 2026 న మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లగొండ బ్రాంచ్-1,2ల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 1996 నోటిఫికేషన్లోని నిబంధనల ప్రకారం నియమితులైన వారందరికీ పాత పెన్షన్ వర్తిస్తుందని, జీఓ ఎంఎస్ 57 ద్వారా కొన్ని విభాగాల్లో దీన్ని అమలు చేస్తున్నప్పటికీ, 1996 బ్యాచ్ ఉద్యోగులకు కూడా ఈ హక్కును వర్తింపజేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. పెన్షన్ అనేది ఉద్యోగుల భవిష్యత్తు భద్రతకు, పదవీ విరమణ అనంతర గౌరవప్రదమైన జీవితానికి ఎంతో కీలకమైన అంశమని స్పష్టం చేశారు. 1996 బ్యాచ్ ఓపెన్ మార్కెట్ ఉద్యోగుల న్యాయమైన ఆకాంక్షలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, వారికి తగిన న్యాయం చేయించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ నేపథ్యంలో పాత పెన్షన్ సాధన కోసం చేపడుతున్న ఈ నిరసన కార్యక్రమానికి క్లాస్-వన్, క్లాస్-టూ ఆఫీసర్ల సంఘం అలాగే ఏజెంట్ల యూనియన్లు తమ పూర్తి సంఘీభావం ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో ఐసీఈయూ బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు కొప్పు వెంకన్న, ఐతగోని లక్ష్మీనారాయణ, పల్లపు లింగయ్య, లెల్లెల శ్రీనివాస్, ఎరుకల యాదగిరి, ఎస్. యాదగిరి, ఎస్. సందీప్, దేవగిరి అంజయ్య, ఎం. రామకృష్ణ, పి. గోపికృష్ణ, కె. వెంకటేశం, వింజమూరి శ్రీనివాస్, పి. శ్రీకాంత్, ఎల్. రామకృష్ణ, బి. సుధాకర్, ఎన్. రామకృష్ణ తదితరులు పాల్గొనగా క్లాస్-1, క్లాస్-2 అధికారులు వంశీకృష్ణ రెడ్డి, కాంచన, లియాంక, వెంకటేశ్వర్లు, ఎల్ఐసి ఏఓఐ రాష్ట్ర నాయకులు బి. రామలింగం, నలపరాజు సైదులు, లియాఫీ నాయకులు ఈదులకంటి యాదయ్య, ఏజెంట్లు చొక్కారపు విజయకుమార్, మాచర్ల సైదులు, నాగార్జున మహేశ్వరి, సోమవరపు పద్మావతి రాములు, అంకురి పృథ్వీరాజ్, కొయ్యాడ రాజు, మనోహర్, శివ, నరేష్, మమత తమ సంఘీభావం తెలిపారు. అదేవిధంగా నల్లగొండ బ్రాంచ్-2 లో నిర్వహించిన కార్యక్రమంలో ఐసీఈయూ అధ్యక్షులు ఏ. కరుణాకర్, కార్యదర్శి సి.హెచ్. రమేష్, వి. శ్రీనివాస్, పెద్ది రమేష్, ఏ. యాదగిరి, చంద్రమోహన్, ఆఫీసర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొనగా.. బ్రాంచ్ మేనేజర్ ఆర్. లక్ష్మ, గోపాలకృష్ణ, శ్రీవల్లి మేడం తదితరులు కూడా పాలుపంచుకున్నారు.
