డ్రగ్స్ కేసులో ఇద్దరి అరెస్ట్..170 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్ స్వాధీనం
- బతుకమ్మ దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత కల్పించాలి.. మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్ - October 15, 2026
- డిండి ఎత్తిపోతల పథకం ఈనెల 17న మహాధర్నా - October 15, 2026
- ఆలయ నిర్మాణానికి లక్ష రూ.విరాళం..భక్తితో ముందుకొచ్చిన మండేగుత్తల కుటుంబ సభ్యులు - October 15, 2026

ఆమనగల్లు:డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు డీసీపీ కే. నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎస్ఓటీ మహేశ్వరం జోన్ బృందం, కడ్తాల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 170 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్, రెండు ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన బబుల్ ఉమ్మర్ అబ్దుల్ అజీజ్ (34), హంసత్ ఫాసన్ (32)లను అరెస్టు చేశారు.నిందితులు మూడేళ్లుగా డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్నట్లు విచారణలో గుర్తించామని పోలీసులు తెలిపారు. కడ్తాల్ పోలీస్ స్టేషన్లో కేసు నంబర్ 373/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
