ఇందిరమ్మ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి : సర్పంచ్ జలజ
- ఇందిరమ్మ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి : సర్పంచ్ జలజ - November 27, 2026
- అమృత్ సరోవర్ చెరువుల వద్ద ఘనంగా రాజ్యాంగ దినోత్సవం - November 27, 2026
- పశువుల ఆరోగ్యంపై రైతులు శ్రద్ధ తీసుకోవాలి - November 25, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 27: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై మండలంలోని కల్మెర గ్రామంలో శుక్రవారం ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించారు. గ్రామ సర్పంచ్ తోటకూరి జలజ యాదయ్య కూలీలకు పథకం వివరాలను తెలియజేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కుటుంబ భద్రతకు భరోసా కల్పించే లక్ష్యంతో రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించే ఈ పథకం ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రసన్నరాణి, ఉప సర్పంచ్ కంభంపాటి లింగమ్మ యాదయ్య, వార్డు సభ్యులు గుండగోని పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
