కొల్లూరి లక్ష్మమ్మకు మాజీ మంత్రి ఎర్రబెల్లి నివాళులు
- చేవెళ్ల ఎమ్మెల్యే కు దసరా శుభాకాంక్షలు తెలిపిన శంకర్పల్లి కాంగ్రెస్ నాయకులు - October 22, 2026
- ఘనంగా శంకర్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ జన్మదిన వేడుకలు - October 22, 2026
- వెంకటపూర్ నుండి అమ్మవారి దర్శనానికి పాదయాత్ర - October 22, 2026

దేవరుప్పుల: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చౌడూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ కొల్లూరి సోమయ్య మాతృమూర్తి లక్ష్మమ్మ మంగళవారం సాయంత్రం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చౌడూరు గ్రామంలోని ఆమె నివాసానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సోమయ్యను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్లా సుందర్ రాంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్, కార్యదర్శి చింత రవి, మాజీ మండల అధ్యక్షుడు బస్వ మల్లేష్, బీఆర్ఎస్ మండల నాయకులు ఏల సుందర్,గ్రామ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
