జూపల్లి లో ఘనంగా దుర్గ భవాని అమ్మవారి ఆగమనం
- నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి - October 9, 2026
- జూపల్లి లో ఘనంగా దుర్గ భవాని అమ్మవారి ఆగమనం - October 9, 2026
- మృతురాలి కుటుంబానికి సర్పంచ్ పరామర్శ..ఆర్థిక సాయం - October 9, 2026

చారకొండ, అక్టోబర్ 9: నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం జూపల్లి గ్రామంలో దుర్గాభవాని యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి ఆగమన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామ యువకులు, పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జూపల్లి భాస్కరరావు యువసేన అధ్యక్షుడు ఎండీ సిరాజ్ గ్రామ యువకులతో కలిసి పాల్గొన్నారు. గ్రామంలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో మతాలకతీతంగా పాల్గొంటూ సామాజిక ఐక్యతకు ప్రాధాన్యమివ్వడం ద్వారా ఎండీ సిరాజ్ ఆదర్శంగా నిలుస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. గ్రామస్థుల భాగస్వామ్యంతో అమ్మవారి ఆగమన వేడుకలు సందడిగా సాగాయి.
