భూముల రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్టీవో అశోక్ రెడ్డి
- బీజేపీ మండల లేబర్ సెల్ కన్వీనర్‌గా శ్రీధర్ - October 13, 2026
- చిక్సిత పొందుతూ లైన్ మెన్ మృతి - October 13, 2026
- హామీలను నెరవేర్చడమే లక్ష్యం : సర్పంచ్ శ్యామల శేఖర్ - October 12, 2026
భూముల రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్టీవో అశోక్ రెడ్డి
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 6: మండలంలోని రామచంద్రపురం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను నల్గొండ ఆర్టీవో యారాల అశోక్‌రెడ్డి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన ఆయన.. సర్వే పనుల పురోగతి, భూముల వివరాల నమోదు, హద్దుల నిర్ధారణ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రీ సర్వేలో భాగంగా చేపడుతున్న క్షేత్రస్థాయి కొలతలు, రికార్డుల పరిశీలన తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రీ సర్వే పనులకు సంబంధించిన వివరాలను తహసీల్దార్ పుష్పలత, ఆర్ఐ జీవీఎస్ రామారావు, సర్వేయర్ మధు ఆర్టీవోకు వివరించారు. గ్రామంలో రీ సర్వే ప్రక్రియ సక్రమంగా జరిగేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. భూముల హద్దులు, సర్వే రికార్డుల విషయంలో స్పష్టత వచ్చేలా క్షేత్రస్థాయిలో వివరాలను నమోదు చేస్తున్నారు. రీ సర్వే ద్వారా భూములకు సంబంధించిన వివరాలను పక్కాగా నమోదు చేయడంతో భవిష్యత్‌లో భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుందన్నారు.

