కల్లుగీత వృత్తి ఆధునికీకరణ సదస్సును జయప్రదం చేయాలి : మాద శీను
- బీజేపీ మండల లేబర్ సెల్ కన్వీనర్‌గా శ్రీధర్ - October 13, 2026
- చిక్సిత పొందుతూ లైన్ మెన్ మృతి - October 13, 2026
- హామీలను నెరవేర్చడమే లక్ష్యం : సర్పంచ్ శ్యామల శేఖర్ - October 12, 2026
కల్లుగీత వృత్తి ఆధునికీకరణ సదస్సును జయప్రదం చేయాలి : మాద శీను
జ్ఞాన తెలంగాణ, కట్టంగూరు, అక్టోబర్ 10: ఈ నెల 14న హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో నిర్వహించనున్న కల్లుగీత వృత్తి ఆధునికీకరణ సదస్సు, కల్లుగీత కార్మిక సంఘం 69వ వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని సంఘం కట్టంగూరు మండల అధ్యక్షుడు మాద శ్రీను పిలుపునిచ్చారు. శనివారం కట్టంగూర్ లోని అమరవీరుల స్మారక భవనంలో సదస్సు పోస్టర్‌ను సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి, వృత్తి అభివృద్ధికి ఆధునికీకరణ అవసరమన్నారు. ఈ కార్యక్రమాల్లో గీత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం మండల ఉపాధ్యక్షులు ఆకుల శంకరయ్య, సురిగి సత్తయ్య, మండల కమిటీ సభ్యులు వనం యాదగిరి, కారింగు సత్తయ్య, గీత కార్మికులు మన్యం శంకర్, మన్యం ఆగమయ్య, మన్యం సైదులు, వనం బాలకృష్ణ, కారింగు జానయ్య తదితరులు పాల్గొన్నారు.
