శ్రీ దుర్గా మాత అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలి.. డిసిసి ఉపాధ్యక్షులు భూపతిరెడ్డి

ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత

శ్రీ పాండురంగ నాయక దేవాలయంలో శరన్నవరాత్రి పూజలు

వెల్దండ:మండల కేంద్రంలోని శ్రీ పాండురంగ నాయక దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా డీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచ్ యన్నం భూపతిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనిషిలో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తాయని అన్నారు. దుర్గామాత అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని పేర్కొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడంతో పాటు ఐక్యతను చాటుతాయని తెలిపారు.ఈ పూజా కార్యక్రమంలో సీఐ రఘువీర్ రెడ్డి, సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, జియాగూడ యాదవ సంఘం అధ్యక్షులు జక్కుల చిన్న జంగయ్య యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు హరికిషన్ నాయక్, జిల్లా కార్యదర్శులు మోతిలాల్ నాయక్, శంకర్ నాయక్, పర్వత్ రెడ్డి, రామచంద్రారెడ్డి, వెంకటయ్య, మల్లయ్య, కృష్ణ ముదిరాజ్, వెంకటేష్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.1001254292.jpg

You may also like...