పెద్ద చెరువుకు హద్దులను గుర్తిస్తాం ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం: తహసిల్దార్ పుష్పలత

పెద్ద చెరువుకు హద్దులను గుర్తిస్తాం

 

ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం:

తహసిల్దార్ పుష్పలత 

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 6 : మండల కేంద్రంలోని పెద్దచెరువును ఎఫ్టిఎల్ పరిధి గుర్తించి హద్దులు ఏర్పాటు చేస్తామని తహసిల్దార్ పుష్పలత తెలిపారు. పెద్ద చెరువు ఆక్రమణకు గురైందని ఇటీవల బీజేపీ నాయకులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో పై అధికారుల ఆదేశాలతో మంగళవారం చెరువును రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ పుష్పలత మాట్లాడుతూ రెవిన్యూ ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా చెరువుకు ఎఫ్ టి ఎల్(పూర్తి నిల్వ సామర్థ్యం )పరిధిని గుర్తించి హద్దులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. చెరువుకు ఉన్న రెండు తూములు శిథిలావస్థకు చేరాయని, చెరువులోకి వచ్చే వరద నీటి కాలువ పూర్తిగా మట్టితో పూడుకపోయిందని, తూములకు, మరమ్మత్తులు పూడికతీత పనులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. చెరువును పూర్తిగా సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని సర్వేయర్ ను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఆక్రమణలకు పాల్పడ్డ వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు. పరిశీలన వెంట మండల గిద్దవార్ జిబిఎస్ రామారావు, జిపిఓ అల్లావుద్దీన్ ఇరిగేషన్ శాఖ అధికారి రాజేష్, నాయకులు ముక్కామల శేఖర్, వార్డు సభ్యులు ఏనుగు సైదులు, బిజెపి నాయకులు కోమటి నర్సింహ్మ,అయితగోని శివ ఉన్నారు.

You may also like...