గడువులోగా భూముల రీసర్వే పూర్తి చేయాలి
- ఉపాధి హామీ నిధుల చెల్లింపుల్లో అక్రమాలు - November 28, 2026
- కొత్త పెన్షన్లపై కాంగ్రెస్ సంబరాలు - November 28, 2026
- దీక్షా దివస్ ఏర్పాట్లను పరిశీలించిన ఎర్రబెల్లి - November 28, 2026

జనగామ: భూముల రీసర్వే పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జనగామ ఆర్డీఓ కార్యాలయంలో రీసర్వే పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. మండలాలు, గ్రామాల వారీగా పనుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను తహసీల్దార్లు, సర్వేయర్లు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో జాప్యం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ గోపీరాం, సర్వే అండ్ ల్యాండ్స్ ఏడీ మన్యంకొండ, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.
