పిల్లల అవసరాన్ని గుర్తించి.. స్పీకర్ బహూకరణ నారగూడెం ప్రభుత్వ పాఠశాలకు సర్పంచ్ మల్లేశ్ చేయూత

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 8 : పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించే ప్రార్థన, సమావేశాలు, ఇతర కార్యక్రమాలు సౌకర్యవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మౌత్ స్పీకర్‌ను గురువారం నారగూడెం సర్పంచ్ కురిమిల్ల మల్లేశ్ అందించారు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్పీకర్ అవసరాన్ని గుర్తించిన ఆయన సొంతంగా స్పీకర్‌ను బహూకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు తమవంతు సహకారం అందించాలని కోరారు. పాఠశాలకు అవసరమైన స్పీకర్‌ను అందించిన సర్పంచ్‌కు పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుప్పెల్లి శంకరయ్య, ఉపాధ్యాయుడు హమీద్, నాయకులు ఎర్రమాద మాధవరెడ్డి, ఎర్రమాద శీను రెడ్డి, సిరియాలో వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.

You may also like...