మండల కేంద్రంలో ఘనంగా వినాయక చవితి పూజలు
- మానవత్వం చాటుకున్న సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ - September 16, 2026
- కంటోన్ పల్లి లో చేయూత పింఛన్ల ఆకస్మిక తనిఖీలు – రాష్ట్ర బృందం పరిశీలన - September 15, 2026
- శ్రీరాములు కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ అధినేత ఆర్థిక సహాయం - September 15, 2026

వెల్దండ సెప్టెంబర్ 15 : వెల్దండ మండల కేంద్రంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వినాయకుని సన్నిధిలో సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షులు భూపతిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గణనాథుని ఆశీస్సులతో మండల ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్ గౌడ్, కృష్ణారెడ్డి, పురుషోత్తం రెడ్డి, క్యాషారపు వెంకటయ్యలతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
