రాచూరులో సహజ వ్యవసాయంపై అవగాహన సదస్సు
- పట్టభద్రుల ఓటు నమోదు పై ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాలి: మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ - October 30, 2026
- నల్ల బ్యాడ్జీలతో మోడల్ స్కూల్ టీచర్ల నిరసన - October 30, 2026
- అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న టిప్పర్ పట్టివేత - October 30, 2026

వెల్దండ : మండలంలోని రాచూరు గ్రామ రైతువేదికలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి శోభారాణి ఆధ్వర్యంలో సహజ వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రసాయన ఎరువులు తగ్గించి జీవామృతం, బీజామృతం, ఘన జీవామృతం తయారీపై వ్యవసాయ అధికారులు రైతులకు శిక్షణ ఇచ్చారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని, నేల ఆరోగ్యం మెరుగవుతుందని సూచించారు.
