రాహుల్ గాంధీ పిలుపు మేరకు రేపు మహేశ్వరంలో OBC భారీ సభ

1001354471.jpg

జాతీయ జనగణనలో OBC కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 04-10-2026 ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు మహేశ్వరంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూడవత్ హరికిషన్ నాయక్ పిలుపునిచ్చారు.భావి భారత ప్రధాని గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, కల్వకుర్తి అభివృద్ధి ప్రదాత గౌరవ శ్రీ కసిరెడ్డి నారాయణరెడ్డి గారి సూచనతో ఈ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.జాతీయ OBC చైర్మన్ గౌరవ శ్రీ అనిల్ జైహింద్ గారు, టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో జరిగే ఈ మహేశ్వరం భారీ బహిరంగ సభకు OBC జిల్లా పదాధికారులు, తాలూకా పదాధికారులు, మండల ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, NSUI, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ విభాగాల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.ఈ సభకు వెళ్లేందుకు వీలుగా వెల్దండ పార్టీ కార్యాలయం వద్ద నుండి మూడు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి గ్రామ పంచాయతీ నుండి 6 నుండి 8 మంది చొప్పున మధ్యాహ్నం 2:00 గంటలకు వెల్దండకు చేరుకొని బయలుదేరి సభను విజయవంతం చేయగలరని ఆయన విజ్ఞప్తి చేశారు.

You may also like...