Daily Archive: September 26, 2026

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలుజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 26 : మండల కేంద్రమైన కట్టంగూర్ లోని ఎంపీడీఓ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఎంపీడీఓ గంట అంజన్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ గంట అంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం లో చాకలి ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలు, త్యాగాలు అమూల్యమైనవని…

ముదిరాజ్ గణేష్ మండపంలో.. ఆత్మీయ కలయిక యూత్ మహా అన్నదానం

వెల్దండ, సెప్టెంబర్ 26: ముదిరాజ్ గణేష్ మండపం ఆధ్వర్యంలో యూత్ సభ్యులు ఆత్మీయ కలయిక యూత్ మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులను ముదిరాజ్ యూత్ సభ్యులు శాలువాలతో సన్మానించి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వినాయకుడి ఆశీస్సులతో మండల ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీను ముదిరాజ్, డీసీసీ ఉపాధ్యక్షులు భూపతిరెడ్డి, కానుగుల జోగయ్య, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి,…

మానవత్వం చాటుకున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కల్వకుర్తి: చదువు కోసం కలలు కంటున్న ఓ నిరుపేద విద్యార్థికి కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన ప్రముఖులు, TASK C.O.O, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి (రఘు అన్న) అండగా నిలిచారు.ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితిలో ఉన్న ఆ విద్యార్థికి రూ. 1,00,000/- ఆర్థిక సహాయం అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు.ఇది కేవలం లక్ష రూపాయల సహాయం మాత్రమే కాదు, ఒక విద్యార్థి భవిష్యత్తుకు,…

ఆమనగల్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

ఆమనగల్: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని శనివారం ఆమనగల్ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక పోరాట యోధురాలిగా, ధిక్కార స్వరానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ మహిళాలోకానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు కలకొండ యాదగిరి మాదిగ, సరికొండ పుల్లన్న తదితరులు పాల్గొన్నారు.

రౌండ్‌-16లోకి దూసుకెళ్లిన సింధు

ఏషియన్‌ గేమ్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు జోరు కొనసాగిస్తోంది. మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో చైనీస్‌ తైపీకి చెందిన చియు పిన్‌-చియాన్పై 21-19, 21-14 తేడాతో విజయం సాధించి రౌండ్‌-16లోకి దూసుకెళ్లింది. తొలి గేమ్‌లో సింధుకు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. బ్రేక్‌...

రాత్రి అన్నం మానేస్తేనే బరువు తగ్గుతారా?

బరువు తగ్గాలని నిర్ణయించుకున్న వెంటనే చాలామంది ముందుగా రాత్రి అన్నాన్ని పూర్తిగా మానేయాలని భావిస్తుంటారు. రాత్రివేళ అన్నం తింటే అది కొవ్వుగా మారి బరువు పెరుగుతుందని అనుకోవడం సాధారణం. అయితే పోషకాహార నిపుణుల సూచనల ప్రకారం రాత్రి అన్నం తినడం ఒక్కటే బరువు పెరగడానికి కారణం కాదు....

మాందాపూర్ లో చాకలి ఐలమ్మ జయంతి

బీబీపేట్ మండలం మాందాపూర్ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సర్పంచ్ హరీష్ యాదవ్ మాట్లాడుతూ. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని స్మరించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ గంగుబాయి ఉపసర్పంచ్ సంతోష్ రెడ్డి , పాలకవర్గ సభ్యులు, గ్రామ రజక సంఘం సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం.. ఘనంగా 131 వ జయంతి వేడుకలు

వెల్దండ, సెప్టెంబర్ 26: వెల్దండ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రజక సంఘం అధ్యక్షుడు రేవల్లి రవి, ఉపాధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు భూపతిరెడ్డి, ఉప సర్పంచ్ శ్రీను ముదిరాజ్ తదితరులు పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు,…

వైయస్ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి..వంశీ చంద్ రెడ్డి దంపతులు

కల్వకుర్తి : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, అనిల్ కుమార్ దంపతుల కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి–డా. సోమాల రఘురామ్ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే,సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి తన సతీమణి ఆశ్లేషతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.

మతసామరస్యానికి ప్రతీక. కోకపెట్ గణేష్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం సోదరుడు.

గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలం పాటలో ఒక ముస్లిం వ్యక్తి లడ్డూను దక్కించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.