Daily Archive: September 26, 2026
వంగూర్: ప్రజా సమస్యలపై రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి,బీఆర్ఎస్ నేత డా.ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి జాజాల గ్రామంలో పర్యటించారు.గ్రామ సర్పంచ్ కాశమ్మని కలిసి స్థానికంగా ఎదురవుతున్న సమస్యలు,అధికారుల వేధింపులపై ఆరా తీశారు.గ్రామ పరిధిలో అక్రమ మైనింగ్, ఇసుక దందా, భూ కబ్జాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ముఖ్యంగా దుందుబి వాగు పరిధిలో అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలపై విచారించారు.దీనిపై ప్రశ్నిస్తే అధికారులు సరైన సమాధానం…
వంగూర్ : తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. అంకు సురేందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూమి, భుక్తి, విముక్తి కోసం చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు….
బాన్సువాడ మండలంలోని సొమ్లా నాయక్ తండాలో సర్పంచ్ మీరిబాయి ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్ రాథోడ్ స్వరూప నేతృత్వంలో శనివారం పోషణ్ మాహ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 9 వరకు నిర్వహిస్తున్న పోషణ్ మాహ్‌లో భాగంగా గర్భిణీలు, బాలింతలకు పోషకాహార ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్ రాథోడ్ స్వరూప మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు ప్రతిరోజూ సమతుల్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచించారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లీబిడ్డలు…
ఆమనగల్లు: ఆమనగల్లు పట్టణంలో శివసేన ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయక విగ్రహాన్ని బీజేపీ సీనియర్ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి గారు భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు.వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామి వారిని వేడుకున్నారు.అనంతరం అక్కడ నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ నేనావత్ పత్యా…
నాగర్ కర్నూల్ మండలానికి చెందిన పుల్జాల గ్రామ ప్రజల చిరకాల సమస్యకు ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శాశ్వత పరిష్కారం చూపారు.గత కొన్నేళ్లుగా పుల్జాల గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గమనించిన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు చొరవ తీసుకున్నారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నాగర్ కర్నూల్ టు మల్కాపూర్ – పుల్జాల, తాళ్లపల్లి, నడిగడ్డ, తెల్కపల్లి మీదుగా…
నాగర్ కర్నూల్ నియోజకవర్గం: నాగర్ కర్నూల్ మండలం పుల్జాల గ్రామంలో ఈరోజు నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామంలోని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ఫోటోలో ఎమ్మెల్యే ఒక విద్యార్థినికి రేషన్ కార్డు అందజేస్తున్న దృశ్యం.
డీజిల్ దందా గుట్టురట్టుఅయిటిపాములలో 2700 లీటర్ల డీజిల్ పట్టివేత జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 26 : మండలంలోని అయిటిపాముల గ్రామంలో ఇళ్లతో పాటు హోటల్లో అక్రమంగా డీజిల్ నిల్వ ఉంచిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు నకిరేకల్, నల్లగొండ సివిల్ సప్లయ్ అధికారులు, కట్టంగూర్ పోలీసులు సంయుక్తంగా శనివారం దాడులు నిర్వహించి సుమారు 2700లీటర్ల డీజిల్ ను సీజ్ చేశారు. హోటల్ యజమాని నారగోని సంధ్యతో పాటు దొమ్మటి మంగమ్మ, నారగోని యాదమ్మలు ఇళ్లలో…
పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి : ఐసీడీఎస్ సూపర్ వైజర్ ఎస్. పద్మావతి కట్టంగూర్, జ్ఞాన తెలంగాణ, సెప్టెంబర్ 26 : గర్భిణులు, బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎస్. పద్మావతి అన్నారు. శనివారం మండలంలోని పిట్టంపల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు, చిరుధాన్యాలు రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అవగాహన కల్పించారు….
జూపల్లి (కల్వకుర్తి): జూపల్లి గ్రామంలో రేపు అనగా 27/09/2026, శనివారం రోజున గౌస్-ఏ-పాక్ గంధోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ దర్గా కమిటీ తెలిపింది.ఈ కార్యక్రమానికి గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని గంధోత్సవాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు.అలాగే సోమవారం 28/09/2026 నాడు కందూరు (అన్నదానం) కార్యక్రమం ఉంటుందని తెలిపారు. భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి గ్యార్వీ పండుగను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అక్షరం ఆరోగ్యం ఆర్ధికం ఆత్మగౌరవం అనే లక్ష్యంపైన నిరంతరం ప్రజలను చైతన్య పరుస్తూ జ్ఞాన సమాజాన్ని నిర్మించడమే ప్రధాన ద్యేయంగ పనిచేస్తున్న స్వేరోస్ నెట్వర్క్ ను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము. నేటి వరకు ఎంతో మందిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, పైలెట్లుగా తయారు చేసి యువతను స్వయం ఉపాధి రంగం వైపు నడిపిస్తు…. సమాజంలో సగౌరవంగా ఆత్మగౌరవంతో జీవించడానికి *గౌరవనీయులు మాజీ IPS ఆఫీసర్ “స్వేరోస్ నెట్వర్క్” ఫౌండర్, జ్ఞానయోధ, సుప్రీమ్ స్వేరో డా, ఆర్….