మానవత్వం చాటుకున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కల్వకుర్తి: చదువు కోసం కలలు కంటున్న ఓ నిరుపేద విద్యార్థికి కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన ప్రముఖులు, TASK C.O.O, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి (రఘు అన్న) అండగా నిలిచారు.

1001344659.jpg

ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితిలో ఉన్న ఆ విద్యార్థికి రూ. 1,00,000/- ఆర్థిక సహాయం అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు.ఇది కేవలం లక్ష రూపాయల సహాయం మాత్రమే కాదు, ఒక విద్యార్థి భవిష్యత్తుకు, ఒక కుటుంబానికి ఇచ్చిన ధైర్యం, భరోసా అని స్థానికులు కొనియాడుతున్నారు.

చదువుకునే విద్యార్థులకు ఎప్పుడూ అండగా ఉంటానని, చదువు కోసం కలలు కనే ఏ ఒక్క విద్యార్థి కల కూడా ఆగిపోకూడదన్నదే తన లక్ష్యమని ఈ సందర్భంగా రఘు అన్న తెలిపారు.

ఈ సహాయం పట్ల విద్యార్థి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రఘు అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...