Daily Archive: September 10, 2026
మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుడి ఆర్థికసాయంజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 10 : మండలంలోని చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన దేవరకొండ గోపి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కక్కిరేణి నవీన్ గౌడ్ గురువారం పార్టీ నాయకులతో కలిసి మృతుడి ఇంటికి వెళ్లి గోపి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారుజ అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి తన వంతుగా రూ.20 వేల ఆర్థికసాయాన్ని మృతుడి తల్లి బుచ్చమ్మకు…
డిండి ఎత్తిపోతలలో ముంపుకు గురవుతున్న ఎర్రవల్లి (వెల్దండ )బోనాల ఉత్సవాలు భావోద్వేగంతో ముగిశాయి.గత తొమ్మిది నెలలుగా ముంపుకు వ్యతిరేకంగా ప్రధాన పండుగలను సైతం బహిష్కరించి నిరసనలు తెలుపుతున్నారు.కానీ గ్రామదేవతలు మా గ్రామాన్ని కాపాడతారనే నమ్మకంతో భావోద్వేగంతో "ఊరెళ్ళి నేను పోతున్నా గ్రామము గట్టిగుంచయ్యా…" అంటూ దేవుళ్ళను వేడుకుంటూ కన్నీళ్లను దిగమింగుతూ బోనాల పండుగ జరుపుకున్నారు.
బాన్సువాడ, సెప్టెంబర్ 10: సెప్టెంబర్ 17ను “తెలంగాణ విమోచన దినోత్సవం”గా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, తెలంగాణ విమోచన చరిత్రను శాశ్వతంగా పరిరక్షించేందుకు “తెలంగాణ సప్త సంకల్పాలు” అమలు చేయాలని కోరుతూ బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డికి బీజేపీ నాయకులు గురువారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో మరువలేని మహోన్నతమైన రోజని అన్నారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాలు, జమీందారీ–జాగీర్దారీ దోపిడీ…
నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 10: ప్రజా భద్రత, నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని నస్రుల్లాబాద్ మండల ఎస్సై వెంకటరావు అన్నారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్సెటి) కామారెడ్డిలో సీసీటీవీ కెమెరా ట్రైనింగ్ రెండో బ్యాచ్ శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సై వెంకటరావు దీపప్రజ్వలన చేసి శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భద్రత, ప్రజల రక్షణలో…
కల్వకుర్తి 10: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ డ్రైవ్లు కొనసాగుతాయని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.తుక్కుగూడలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలో జరిగిన జాబ్ డ్రైవ్ ఇంటర్వ్యూలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూకు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 35 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. వెల్దండ నుంచి 11, కల్వకుర్తి నుంచి 7, ఆమనగల్ నుంచి 16, తలకొండపల్లి నుంచి 1 మంది హాజరయ్యారు.ప్రతి ఉద్యోగ…
ఆమనగల్ 10: పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని మున్సిపల్ చైర్మన్ మీ పత్యా నాయక్ పిలుపునిచ్చారు.ఆమనగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాల వల్ల చెరువుల్లోకి రసాయనాలు కలిసి కాలుష్యం పెరుగుతుందన్నారు.రసాయనాలతో చెరువులోని చిన్న జీవరాశులు చనిపోతాయని, ఆ నీటిని తాగి, ఆ నీటిలో పెరిగిన చేపలు తినడం…
సంగారెడ్డి, సెప్టెంబర్ 10: వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ సంగారెడ్డి పట్టణంలో వ్యవస్థాపక అధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ బృందం ద్వారా గత 18 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి సంవత్సరం పర్యావరణాన్ని కాపాడడం కోసం "మట్టి గణపతే మహా గణపతి" అనే నినాదంతో దాదాపు 5000 మట్టి వినాయకుల ప్రతిమలను సంగారెడ్డి పట్టణ ప్రజలకు ఉచితంగా అందజేస్తుంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా 5016 మట్టి వినాయకులను పంపిణీ…
కల్వకుర్తి 10: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలో కరెంటు కోతలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. శ్రీశైలం – హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి ధర్నాకు దిగారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను గాలికి వదిలేసిందని ఆరోపించారు.రోజురోజుకు కరెంటు కోతలు విధిస్తూ రైతులను వేధిస్తున్నారని, కరువుతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో…
సంగారెడ్డి, సెప్టెంబర్ 10: వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని గురువారం సంగారెడ్డి జిల్లా రాంచంద్రాపురం మండల కేంద్రములోని సండే మార్కేట్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా పలువురు ఆమె విగ్రహానికి పూలమాలలు, పూలు సమర్పించి, కొబ్బరి కాయలు కొట్టి నివాళులు అర్పించారు. ఈ సందర్భముగా ఆమె పెత్తందారి విధానానికి, దోపిడికి,దేశ్ ముఖ్ లకు వ్యతిరేకంగా, దొర దొరసాని సంస్కృతికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరు చేసిన వీర మహిళ చాకలి ఐలమ్మ అని ఆమె త్యాగనిరతిని…
వెల్దండ సెప్టెంబర్ : వెల్దండ మండలంలోని చెదురుపల్లి గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ ధన్ సింగ్ నాయక్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందేలా చూస్తామని అన్నారు.స్మార్ట్ కార్డుల ద్వారా పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ సరుకులు అందుతాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మెరుగు సహదేవ్, వార్డు సభ్యులు శివ యాదవ్, తిరుపతి,…