Daily Archive: September 17, 2026
వెల్దండ సెప్టెంబర్ 17:తెలంగాణ విమోచన దినం సందర్భంగా వెల్దండ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సింగిల్ విండో) కార్యాలయంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విమోచన పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్, మాజీ సర్పంచ్ పంతు నాయక్,సీఈఓ…
జ్ఞానతెలంగాణ,కీసర: రేషన్ బియ్యం కేసులో నిందితులకు బెయిల్ ఇప్పించేందుకు భారీగా లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కీసర సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. నిందితుల నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేసి, అందులో భాగంగా రూ.5 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసినట్లు తెలుస్తోంది. కీసర చెరువు వద్ద నిమజ్జనం విధుల్లో ఉన్న సమయంలో కారులో లంచం తీసుకుంటున్న ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డి ఏసీబీ…
వెల్దండ, సెప్టెంబర్ 16 :వెల్దండ మండల కేంద్రానికి చెందిన మాడుగుల సత్తయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించి, కుటుంబ సభ్యులకు రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లింగం, మాజీ ఎంపీటీసీ జ్యోతి నిరంజన్, ఉప సర్పంచ్ జంగిలి నిరంజన్, మాజీ సర్పంచ్ గుద్దేటి ప్రభాకర్, వార్డు…
వెల్దండ సెప్టెంబర్ 16: వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తన వంతు సహకారంగా మండప నిర్వాహకులకు రూ.10,000/- చందాను సర్పంచ్ కొండల్ యాదవ్ అందజేశారు.గ్రామంలో పండుగలు,ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజలందరూ ఐక్యతతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.యువత ముందుండి నిర్వహించే ఆజాద్ యూత్ వంటి యువజన సంఘాల కార్యక్రమాలకు అండగా ఉంటామని తెలిపారు.ఈ సందర్భంగా మండప నిర్వాహకులు, ఆజాద్ యూత్ సభ్యులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో పోతేపల్లి గ్రామ…
నాగర్ కర్నూల్ / వెల్దండ 16: నాగర్ కర్నూల్ జిల్లా విద్యుత్ పర్యవేక్షక ఇంజనీర్ (SE) నరసింహారెడ్డిని వెల్దండ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుట్టా రాంరెడ్డి బుధవారం నాగర్ కర్నూల్ విద్యుత్ కార్యాలయంలో బొల్లంపల్లి గ్రామ రైతులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. మండలంలో విద్యుత్ సరఫరాలో కోతలు విధించకుండా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని పర్యవేక్షక ఇంజనీర్ ని కోరారు.కొన్ని మరమ్మతుల కారణంగా అంతరాయం ఏర్పడుతున్న మాట వాస్తవమేనని, రైతులకు సరిపడా విద్యుత్…
వెల్దండ సెప్టెంబర్ 16: వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో జరుగుతున్న సబ్ స్టేషన్ నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ మండల యువ నాయకులు వావిళ్ళ కిరణ్ కుమార్ యాదవ్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో, కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వావిళ్ళ ఉమా మనీలా సంజీవ్ కుమార్ యాదవ్ ల ప్రత్యేక చొరవతో పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు.అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.ఈ సబ్ స్టేషన్…
బీసీ కుల గణన చేస్తామని మాట ఇచ్చిన ప్రధాని మోదీ, ఆ తర్వాత బీసీలను వంచించారనీ బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అద్యక్షులు దన్నోజు అరవింద్ చారి విమర్శించారు. నాగర్కర్నూల్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బిజెపికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. గత 12సంవత్సరాలుగా బీసీలకు మోసం చేస్తూ ఉన్నత వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు..
బెజ్జూరు: మండలంలోని ఎల్కపల్లి గ్రామంలోని అంబేద్కర్ భవన్‌లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లహన్ రాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. రాష్ట్ర నాయకులతో పాటు మంచిర్యాల TUV నాయకులు, బెజ్జూరు మండల నాయకులు పాల్గొన్నారు. కళాజాత నాట్య బృందం ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలతో కార్యక్రమం సందడిగా సాగింది. ఉద్యమకారులు ఉత్సాహంగా పాల్గొని ఉద్యమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నాయకులు ఉద్యమకారుల సమస్యలు, భవిష్యత్…
సిర్పూర్(టి): మండలంలోని పారిగాం గ్రామం నుంచి ప్రాణహిత నదికి వెళ్లే దారి వర్షాలతో బురదమయంగా మారింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో రైతుల పొలాలు ఉండటంతో వ్యవసాయ పనుల కోసం నిత్యం రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో బురద కారణంగా వాహనాలు, ఎడ్లబండ్లు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంటోందన్నారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఫామ్ రోడ్డు నిర్మించాలని రైతులు కోరుతున్నారు.