ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

కట్టంగూర్,సెప్టెంబర్ 26 : మండల కేంద్రమైన కట్టంగూర్ లోని ఎంపీడీఓ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఎంపీడీఓ గంట అంజన్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎంపీడీఓ గంట అంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం లో చాకలి ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలు, త్యాగాలు అమూల్యమైనవని కొనియాడారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం నైజాం నిరంకుశ పాలనపై, దొరల అరాచకాలపై ఆమె వీరోచితంగా సాగించిన పోరాటం భావితరాలకు నిరంతరం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మహిళా చైతన్యానికి, హక్కుల పోరాటానికి ఐలమ్మ నిలువెత్తు ప్రతీకగా నిలిచారని, ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ భోనగిరి రమేష్, ఎంపీఓ కళ్ళెపురం స్వరూపారాణి, టైపిస్టు వాణి, జూనియర్ అసిస్టెంట్ నక్కా శివ శంకర్, కంప్యూటర్ ఆపరేటర్లు గోవింద్, లక్ష్మణ్, శేఖర్, శ్రీకాంత్, కార్యాలయ సిబ్బంది కంచర్ల శంకర్, సంతోష , కట్టంగూర్ గ్రామపంచాయతీ బిల్ కలెక్టర్ చిత్తలూరి జానకి రాములు తదితరులు పాల్గొన్నారు.

You may also like...