మతసామరస్యానికి ప్రతీక. కోకపెట్ గణేష్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం సోదరుడు.

280798.jpg

గండిపేట్ :మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మరో అద్భుత ఘట్టం కోకాపేటలో చోటుచేసుకుంది. గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలం పాటలో ఒక ముస్లిం వ్యక్తి లడ్డూను దక్కించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.కోకాపేటలో ఏర్పాటు చేసిన ఒక గణేష్ మండపంలో నిర్వాహకులు సాంప్రదాయబద్ధంగా లడ్డూ వేలం పాటను (లడ్డూ ప్రసాదం వేలం) నిర్వహించారు. ఈ వేలంలో స్థానిక TGSPDCL (తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ) లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగి 'గౌస్' ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరితో పోటీపడి భక్తిశ్రద్ధలతో పాట పాడి ఆయన ఈ పవిత్రమైన వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు.మతం ఏదైనా భక్తి, నమ్మకం ఒక్కటే అని నిరూపిస్తూ గౌస్ ఈ వేలంలో పాల్గొనడం పట్ల స్థానికులు మరియు మండప నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. లడ్డూను గెలుచుకున్న గౌస్‌ను నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సంఘటన స్థానికంగా మత సామరస్యాన్ని, సోదరభావాన్ని మరింత పెంపొందించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

You may also like...