Daily Archive: September 15, 2026

హయత్‌నగర్‌ సమీపంలో ఘోర ప్రమాదం

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుంట్లూరు రాజీవ్‌ గృహకల్ప వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఘటనను...

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్‌ 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. కేంద్ర సాయుధ దళాల కవాతు రిహార్సల్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన ఆయన, కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో...

తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్-Vతో సీఎం భేటీ

హైదరాబాద్‌:హైదరాబాద్‌లోని తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్-Vతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రితో పాటు మంత్రి అజారుద్దీన్‌, సీఎస్‌ సంజయ్‌ జాజు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు,...

మోకిల లో విద్యుదాఘాతం.. ఎంబీఏ విద్యార్థి మృతి

రంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్‌ వసతి గృహం వద్ద విద్యుదాఘాతానికి గురై ఎంబీఏ విద్యార్థి ఆర్య మృతిచెందాడు. ప్రమాదంతో వసతి గృహంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. విద్యుత్‌ షాక్‌కు గురైన...

కేసీఆర్‌ ఫాంహౌస్‌ వద్ద ‘పసుపు శుద్ధి’.. ఏడుగురు అరెస్ట్‌

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌ వద్ద పసుపు నీటితో శుద్ధి చేసిన ఘటనపై పోలీసులు కఠిన చర్యలకు దిగారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి ఏడుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో వరదరాజపూర్‌ గ్రామానికి చెందిన మాజీ...

కరెంట్ కోతలకు నిరసనగా సబ్‌స్టేషన్‌ ముందు రైతుల ధర్నా

నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలం తీగలపల్లి సబ్‌స్టేషన్‌ ఎదుట కరెంట్ కోతలకు నిరసనగా ఆందోళనకు దిగిన రైతులుసబ్‌స్టేషన్‌ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగినబావాయిపల్లి, జనంపల్లి, తీగలపల్లి గ్రామాలకు చెందిన రైతులు అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్Your browser does not support the video tag.

తొంకిని రహదారి అధ్వానం.. బురదలోనే రాకపోకలు

సిర్పూర్‌(టి): మండలం తొంకిని గ్రామ సమీపంలోని ప్రాణహిత నదికి వెళ్లే మార్గం అధ్వానంగా మారింది. వర్షాలతో రహదారి మొత్తం బురదమయంగా మారడంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గం గుండా రైతులు తమ చేనులకు వెళ్తుండగా, నదికి స్నానానికి వచ్చే భక్తులు కూడా అవస్థలు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీరు సైతం రోడ్డుపై నిల్వ ఉండటంతో సమస్య మరింత తీవ్రమైంది. రోడ్డు మంజూరు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు, భక్తులు ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.

నీట్ లో సత్తా చాటిన నిరుపేద బిడ్డ – అండగా నిలిచిన జోగయ్య

వెల్దండ సెప్టెంబర్ 15: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి చెందిన గుద్దేటి శేఖర్ – అలివేల దంపతుల కుమార్తె గుద్దేటి సరిత ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది.నిరుపేద కుటుంబానికి చెందిన సరిత ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు కానుగుల జోగయ్య సరితను ఇంటికి…

భార్య తల నరికిన నిందితుడి దారుణ అంతం

అస్సాంలో భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న రామానుజ్ గోస్వామి (28) పోలీసు కస్టడీలోనే మృతి చెందాడు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా కదులుతున్న పోలీసు వాహనం నుంచి దూకడంతో తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం తెల్లవారుజామున గువాహటిలో ఈ...

విదేశీ భారతీయుల సత్తా..

పదేళ్లలో 2.5 రెట్లు పెరుగుదల విదేశాల్లో స్థిరపడిన భారతీయులు మాతృభూమికి పంపుతున్న సొమ్ము రికార్డు స్థాయికి చేరింది. రెమిటెన్సుల విషయంలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గతేడాది భారత్‌కు ఏకంగా 151 బిలియన్‌ డాలర్ల రెమిటెన్సులు అందాయి. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.14.47 లక్షల కోట్లు....