నిమజ్జన ఊరేగింపులో రౌడీయిజం.. కానిస్టేబుల్‌పై కత్తితో దాడి

వికారాబాద్ జిల్లా, సెప్టెంబర్ 26: పరిగిలో వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు గ్రూపుల మధ్య తలెత్తిన గొడవను అదుపు చేసేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ నర్సింహులుపై ఓ యువకుడు విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా జరిగిన దాడితో అక్కడున్న భక్తులు, పోలీసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గాయపడిన కానిస్టేబుల్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిమజ్జన ఊరేగింపులో శాంతిభద్రతలు కాపాడేందుకు విధుల్లో ఉన్న పోలీసుపైనే కత్తితో దాడి జరగడం కలకలం రేపింది. దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో పరిగిలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

You may also like...